KL Rahul Goes To Delhi For Rs.14 Crore | ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ( IPL Mega Auction ) ఆసక్తికరంగా సాగుతుంది. ప్లేయర్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి.
ఇప్పటికే రిషబ్ పంత్ ( Rishab Pant ) ను ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర రూ.27 కోట్లకు లక్నో దక్కించుకున్న విషయం తెల్సిందే. అలాగే శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer ) ను రూ.26.75 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది.
మరో స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ( KL Rahul ) కూడా భారీ ధరకు అమ్ముడయ్యాడు. బ్యాటర్, వికెట్ కీపర్ రాహుల్ ను రూ.14 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది.
మరోవైపు రూ.12.25 కోట్లకు టీం ఇండియా బౌలర్ సిరాజ్ ( Siraj ) ను గుజరాత్ సొంతం చేసుకుంది. రూ.10 కోట్లకు మహమ్మద్ షమీ ( Shami )ని హైదరాబాద్ కొనుగోలు చేసింది.









