Maharastra Assembly Election Results | మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని అందరూ అంచనా వేశారు.
కానీ ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ఘన విజయం దిశగా దూసుకెళ్తుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని శివసేన ఉద్ధవ్, ఎన్సీపీ శరద్ పవార్ కూటమి మహా వికాస్ అఘాడీ కనీస పోటీని ఇవ్వలేకపోయింది.
మొత్తం 288 సీట్లకు గాను 145 మెజారిటీ సంఖ్య. అయితే మధ్యాహ్నం వరకు వెలువడిన ఫలితాల్లో మహాయుతి కూటమి 217 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. మహా వికాస్ అఘాడీ 55 సీట్లలో లీడింగ్ లో ఉండగా, 16 స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు.
ఈ క్రమంలో మహాయుతి కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖరారు అయ్యింది.









