World War 3 ?| రష్యా అధినేత వ్లాదమిర్ పుతిన్ ( Vladimir Putin ) కీలక ఫైల్ పై సంతకం చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ( Ukraine-Russia War ) మొదలై వెయ్యిరోజులు పూర్తయిన వేళ ప్రపంచవ్యాప్తంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమ దేశం అందించే లాంగ్ రేంజ్ మిస్సైళ్ల ( Longrange Missiles )ను రష్యా దేశంపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ( Joe Biden ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో పుతిన్ రంగంలోకి దిగారు. న్యూక్లియర్ వెపన్స్ ( Nuclear Weapons ) ను వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే ఫైల్స్ ( Files ) పై ఆయన సంతకం చేశారు. దింతో మూడవ ప్రపంచ యుద్ధం అంచునకు వెళ్తున్నాం అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్న దేశ సహాయంతో మరే దేశమైన తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని పుతిన్ పేర్కొన్నారు. రష్యాపై లాంగ్ రేంజ్ మిసైళ్లను ప్రయోగిస్తే నాటో ( NATO ), అమెరికా ( USA ), యూరోప్ ( Europe ) దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లే భావిస్తామని గతంలోనే పుతిన్ చెప్పారు.