Saturday 31st January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కేటుగాళ్ళ చేతిలో మోసపోయిన నటి దిశా పటానీ తండ్రి

కేటుగాళ్ళ చేతిలో మోసపోయిన నటి దిశా పటానీ తండ్రి

Disha Patani’s Father Duped Of RS. 25 Lakh | ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh ) ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగం ఇప్పస్తామని చెప్పి బాలీవుడ్ నటి దిశా పాటనీ ( Disha Patani ) తండ్రి నుండి రూ.లక్షలు కాజేశారు కొందరు కేటుగాళ్ళు. వివరాల్లోకి వెళ్తే, నటి దిశా పటానీ తండ్రి జగదీష్ పటాని రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ ( Deputy SP ).

ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీకి చెందిన జగదీష్ కు కామన్ ఫ్రెండ్స్ ( Common Friends ) ద్వారా దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాష్ అనే వ్యక్తులు పరిచయం అయ్యారు. తమకు ప్రభుత్వ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయని, ప్రభుత్వ కమిషన్ లో చైర్మన్, వైస్ చైర్మన్ వంటి ఉన్నత పదవులు ఇప్పిస్తామని నమ్మబలికారు.

ఇందుకోసం జగదీష్ నుండి రూ.25 లక్షలు వసూలు చేశారు. తీరా మూడు నెలలు గడిచినా పదవి ఇప్పివ్వకపోవడంతో జగదీష్ వారిని నిలదీశాడు. దింతో ఇచ్చిన డబ్బులను వడ్డీతో సహా తిరిగి ఇస్తామని వారు చెప్పారు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా బెదిరించారు.

దింతో దిశా పటానీ తండ్రి పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుల కోసం గాలిస్తున్నారు.

You may also like
రష్యన్ అమ్మాయిలతో సెక్స్..బిల్ గేట్స్ కు రోగం?
‘లేడికి-లేడి గెటప్ కు తేడా తెలీదా’..జగన్ కు కమెడియన్ కౌంటర్
పాడి కౌశిక్ పై ఎంఐఎం, ఐపీఎస్ సంఘం తీవ్ర ఆగ్రహం
ఖమ్మం మంత్రిపై వైఎస్ జగన్ కు ఫిర్యాదు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions