Pawan Kalyan Serious On Actor Karthi | తమిళ నటుడు కార్తీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan )మందలించారు. సనాతన ధర్మాని ( Sanatana Dharma )కి సంబంధించిన విషయాల్లో ఇష్టానుసారం జోకులు వేయడం.. దాన్ని మీమ్స్ ( Memes ) చేయడం సరికాదని హితవుపలికారు పవన్ కళ్యాణ్.
ఇటీవల జరిగిన ఓ సినిమా ఫంక్షన్ లో కూడా ఇలాగే జోకులు వేశారని మండిపడ్డారు. సీరియస్ ( Serious ) అంశాలను, ఎంతోమంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలను మాట్లాడే సమయంలో జాగ్రత్త వహించాలన్నారు.
‘హిందూ దేవతలను ఇష్టానుసారం వ్యంగ్యంగా మాట్లాడుతూ, వారిపై రకరకాల జోకులు వేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా.. మా మనోభావాలు దెబ్బ తిన్న నోరు మూసుకొని ఉండాలా… ఇదేనా మీరు చెబుతున్న సెక్యూలరిజం..? ‘ అని డిప్యూటీ సీఎం కన్నెర్ర చేశారు.
కాగా సోమవారం రాత్రి హైదరాబాద్ లో కార్తీ ( Karthi ) నటించిన ‘ సత్యం సుందరం ‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ( Pre Release Event ) జరిగింది. ఈ సందర్భంగా లడ్డూ కావాలా నాయనా అంటూ యాంకర్ ( Anchor ) కార్తీని అడిగింది.
దింతో ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడొద్దు, లడ్డూ అనేది సెన్సిటివ్ ( Sensitive ) అంశం అని కార్తీ నవ్వుతూ తిరస్కరించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా పవన్ స్పందించారు.