Saturday 21st September 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > వారానికి 40 గంటలే పని..చట్టం తేవాలి

వారానికి 40 గంటలే పని..చట్టం తేవాలి

Shashi Tharoor On Working Hours | యర్నేస్ట్ అండ్ యంగ్ ఇండియా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ( Ernst And Young India ) లో పనిచేస్తున్న కోచికి చెందిన అన్నా సెబాస్టియన్ ( Anna Sebastian ) పని ఒత్తిడి కారణంగా మరణించిన విషయం తెల్సిందే.

చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న 26 ఏళ్ల సెబాస్టియన్ గత నాలుగు నెలలుగా రోజుకు 14 గంటల పాటు తీవ్ర ఒత్తిడి మధ్య పనిచేశారు. ఈ క్రమంలో జులై 20న పనిచేస్తూ ఒక్కసారిగా కుప్పకులారు.

ఈ నేపథ్యంలో పని గంటలపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఎంపీ శశిథరూర్ ( Shashi Tharoor ) స్పందించారు.

ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో రోజుకు 8 గంటలు, వారానికి ఐదు రోజులు మించి ఉద్యోగులతో పని చేయించకూడదని పేర్కొన్నారు. ఈ మేరకు ఫిక్స్ద్ క్యాలెండర్ ఉండాలని సూచించారు.

కంపెనీలు అమానవీయ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు, జరిమానా విధించే విధంగా చట్టం తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. మానవహక్కులను అడ్డుకోకూడదన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్లు శశిథరూర్ చెప్పారు.

You may also like
స్వామివారి దగ్గర ఇలా జరగడం పాపం, ఘోరాతి ఘోరం
లడ్డూ వివాదం..టీటీడీకి తెలంగాణ విజయ డెయిరీ ఆఫర్
మోదీజీ దయచేసి మణిపూర్ ను సందర్శించండి: రెజ్లర్ ఎమోషనల్
పొత్తు ఉంటే వైసీపీ..లేకుంటే బీజేపీ లోకి: ముద్రగడ ఆలోచన

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions