Saturday 31st January 2026
12:07:03 PM
Home > తాజా > ప్రాణాలతో పోరాడుతున్న అభిమాని..ఎన్టీఆర్ వీడియో కాల్

ప్రాణాలతో పోరాడుతున్న అభిమాని..ఎన్టీఆర్ వీడియో కాల్

Jr. NTR Video Call With Fan | ఏపీకి చెందిన కౌశిక్ ( Koushik ) అనే వ్యక్తి గత కొన్నిరోజులుగా బోన్ క్యాన్సర్ ( Bone Cancer ) తో తీవ్రంగా బాధపడుతున్నారు.

ఈ క్రమంలో తాను జూనియర్ ఎన్టీఆర్ ( Jr. NTR ) కు వీరాభిమానినని, దేవర ( Devara ) సినిమా చూసేంతవరకైనా తనను బ్రతికించాలని సదరు అభిమాని వైద్యులను వేడుకున్నాడు.

మరోవైపు తన కుమారుడి వైద్యానికి సహాయం చేయాలంటూ కౌశిక్ తల్లి మీడియా ముఖంగా కన్నీటిపర్యంతం అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

ఎట్టకేలకు ఈ విషయం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దృష్టికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో కౌశిక్ తో ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఏ మాత్రం భయపడొద్దని భరోసా ఇచ్చారు.

ఎప్పూడూ ధైర్యంగా ఉండాలని చెప్పారు. అలాగే తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా మాట్లాడడంతో అభిమాని కౌశిక్ ఆనందానికి అవధులు లేవు.

You may also like
chiranjeevi
పద్మ అవార్డు గ్రహీతలకు ‘చిరు’ సన్మానం..!
‘స్పిరిట్’ లో విలన్ గా ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ ?
Allu Chiru
‘ఇది బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు’
న్యూ ఇయర్ సర్ప్రైజ్..పవన్ కొత్త సినిమా

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions