Cm Mamata Meets Protesting Doctors | కోల్కత్త లోని ఆర్ జి కర్ మెడికల్ హాస్పిటల్ మరియు కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కుడిపేసింది.
ఈ క్రమంలో న్యాయం కావాలంటూ వైద్యులు గత నెలరోజులుగా నిరసనలు చేస్తున్నారు. కోల్కత్త లోని ‘ స్వస్త్ భవన్ ‘ ఎదుట నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో శనివారం వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన శిబిరానికి వెళ్లడం ఆసక్తిగా మారింది. స్వయంగా సీఎం రావడంతో వీ వాంట్ జస్టిస్ అంటూ వైద్యులు నినదించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తాను సీఎంగా ఇక్కడికి రాలేదని, సోదరిగా వచినట్లు చెప్పారు. వైద్యుల నడిరోడ్లపై నిరసనలు చేస్తుంటే తాను ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
వైద్యుల డిమాండ్ల పై కచ్చితంగా అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని సీఎం మమతా స్పష్టం చేశారు.