Friday 30th January 2026
12:07:03 PM
Home > తెలంగాణ > నన్ను కాల్చి చంపండి..కానీ బిల్డింగ్ ను కూల్చవద్దు

నన్ను కాల్చి చంపండి..కానీ బిల్డింగ్ ను కూల్చవద్దు

Akbaruddin Owaisi On Hydra | హైదరాబాద్ ( Hyderabad ) లో అక్రమ కట్టడాలను హైడ్రా ( Hydra ) నేలమట్టం చేస్తున్న విషయము తెల్సిందే. ఈ నేపథ్యంలో ఓల్డ్ సిటీ ( Old City ) బండ్లగూడ లోని ఫాతిమా ఓవైసీ కాలేజి (  Fatima Owaisi Women College )ని కూడా కూల్చేస్తారని విస్తృత ప్రచారం జరుగుతుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో స్పందించిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ( Akbaruddin Owaisi )సంచలన వ్యాఖ్యలు. అవసరమైతే తనపై కత్తులతో దాడి చేయండి, బుల్లెట్ల వర్షం కురిపించండి కానీ, 40 వేల మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్న కాలేజీని కూల్చవద్దని, తాను చేస్తున్న మంచి పనిని నాశనం చేయవద్దని వ్యాఖ్యానించారు.

కాలేజీలో విద్యార్థులకు అందుతున్న నాణ్యమైన విద్యను, విజయాన్ని చూసి కొందరు అసూయపడుతున్నారని ఓవైసీ విమర్శించారు.

అణగారిన విద్యార్థుల అభ్యున్నతి కోసం తాను చేస్తున్న ఈ మంచి పనిని మాత్రం అడ్డుకోవద్దని నొక్కి చెప్పారు. ఎవరికైనా తనతో శత్రుత్వం ఉంటే కత్తులతో తన శరీరంపై దాడి చేయండి, కానీ తన పనిని మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.

ఇలా వ్యాఖ్యానించడం వల్ల శత్రువులతో పోరాడే శక్తి తనకు లేదని ఎవరూ భావించవద్దని, తాను శత్రువులకు వెన్ను చూపే వ్యక్తిని కాదని ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.

You may also like
‘చైనీస్ మాంజా తెగదు..కానీ మనుషుల మెడలు తెగ్గోస్తుంది’
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
kalvakuntla kavitha
సీఎం రేవంత్ తో హరీశ్ మాట్లాడింది అందరికీ తెలుసు: కవిత
note books distribution
KBK Group-Lions Club ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions