Sachin Tendulkar | మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) గాడ్ ఆఫ్ క్రికెట్ (God of Cricket) అని కీర్తనలు పొందేందుకు ఎంతగానో శ్రమించారు. పిన్న వయస్సులోనే భీకర బౌలర్లను ఎదుర్కొని భారత్ కు ఎన్నో విజయాలు అందించారు.
సచిన్ కెరీర్ లో ఆగస్టు 14వ తేదీ చాలా స్పెషల్. కారణం కేవలం 17 ఏళ్ల వయస్సులోనే సరిగ్గా ఆగస్ట్ 14న అంతర్జాతీయ క్రికెట్ లో తొలి సెంచరీని సచిన్ నమోదు చేశారు. 1990 ఆగస్ట్ 14న ఇంగ్లాండ్ తో జరిగిన రెండవ టెస్టు మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో టెండూల్కర్ తొలి శతక పరుగులు సాధించారు.
ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి చివరి వరకు అజేయంగా 189 బాల్స్ లో 119 పరుగులు చేసి మ్యాచ్ డ్రా అవ్వడంలో కీలకంగా వ్యవహారించారు. 1989 లో పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి మాస్టర్ బ్లాస్టర్ అడుగుపెట్టారు.
ఇదే సమయంలో వన్డే లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే తొలి 15 మ్యాచులో ఆయన ఒక్క శతకాన్ని కూడా నమోదు చేయలేదు. ఇదిలా ఉండగా ఇంటర్నేషనల్ క్రికెట్ లో 100 శతకాలు నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా ఎవరికీ అందనంత ఎత్తులో సచిన్ ఉన్నారు.