CM Himantha | రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు జులై నెల నుండి వారి విద్యుత్ చార్జీలను వారే సొంత డబ్బులతో చెల్లించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు అస్సాం సీఎం హిమాంత బిశ్వాశర్మ.
ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. జులై నుండి తాను, సీఎస్ ఈ నిబంధనను పాటిస్తున్నట్లు పేర్కొన్నారు.
75 ఏళ్లుగా మన దేశంలోని మంత్రుల, ప్రజా ప్రతినిధుల, ప్రభుత్వ ఉన్నతాధికారుల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని, కానీ ఇక నుండి ఈ విఐపి సంస్కృతికి ముగింపు పలుకుతున్నట్లు ఆయన చెప్పారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దీనివల్ల విద్యుత్ బోర్డుకు వచ్చే నష్టాలను నివారించవచ్చని, దింతో విద్యుత్ శాఖ కరెంట్ చార్జీలను పెంచాల్సిన అవసరం లేదని తెలిపారు.