Sunday 6th July 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పవన్ ప్రమాణ స్వీకారం.. మెగా ఫ్యామిలీ ఎమోషనల్!

పవన్ ప్రమాణ స్వీకారం.. మెగా ఫ్యామిలీ ఎమోషనల్!

pawan kalyan

Pawan Kalyan Swearing In Ceremony | 2019 ఎన్నికల్లో పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నో అవమానాలను ఓర్చుకుని 2024 ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించి దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నారు.

పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. బుధవారం నాడు గన్నవరం వద్ద జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాష్ట్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు.

అలాగే డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎన్నో ఎత్తు, పల్లాలతో కూడిన పవన్ రాజకీయ ప్రయాణంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ తరలివచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, రాం చరణ్, నాగబాబు ఇలా పవన్ ప్రమాణ స్వీకార సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ తరలివచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, రాం చరణ్, నాగబాబు ఇలా పవన్ ప్రమాణ స్వీకార సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఆయన భార్య అన్నా లెజినోవా స్వయంగా ఫోటోలు తీశారు.

ఈ వేడుకకు పవన్ కమారుడు అకిరా, కుమార్తె ఆద్య సంప్రదాయ దుస్తుల్లో హాజరై తండ్రి ప్రమాణా స్వీకారాన్ని కనులారా ఆస్వాదించారు. చివరగా ప్రధాని మోదీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల చేతులు పట్టుకొని ప్రజలకు అభివాదం చేశారు. ఇరువురిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

You may also like
సిగాచీ ప్రమాదం..జన్మదిన వేడుకలకు జగ్గారెడ్డి దూరం
‘హిందీ రుద్దలేరు..20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ఠాక్రే సోదరులు’
‘ఫిష్ వెంకట్ కు ప్రభాస్ సహాయం..అందులో నిజం లేదు’
ఇద్దరు కుమారులతో పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions