Polling Percentage in AP | ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో (Andra Pradesh Elections) గతంలో కంటే ఎక్కువ శాతం పోలింగ్ (Polling) నమోదైందని తెలిపారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena).
ఈ మేరకు ఆయన బుధవారం మీడియా తో మాట్లాడారు. రాష్ట్రంలో ఈవీఎంల (EVM) ద్వారా 80.66 శాతం, పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot)ద్వారా 1.2 శాతం పోలింగ్ నమోదయ్యిందని వెల్లడించారు. మొత్తంగా ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు వివరించారు.
Read Also: KURKURE కొనివ్వలేదని భర్తకు విడాకులు ఇచ్చిన భార్య!
ఇక 2014 లో 78.41 శాతం, 2019 లో 79.77 శాతం పోలింగ్ నమోదు కాగా, గతంలో కంటే ఈ సారి 2.09 పోలింగ్ అధికంగా నమోదు అయినట్లు ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 350 స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎం లను భద్రపరిచినట్లు చెప్పారు.
అత్యధికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91 శాతం, అత్యల్పoగా తిరుపతిలో 63.32 శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. ఇక పోతే అల్లర్లు సృష్టించిన వారిని రెండ్రోజుల్లో అరెస్ట్ చేయనున్నట్లు స్పష్టం చేశారు.