Kamal Hassan On Vijay Party | సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ (Kamal అధ్యక్షుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ ఇంకా ఇండి కూటమిలో చేరలేదని తెలిపారు. దేశం కోసం నిస్వార్థంగా ఆలోచించే వారితోనే కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.
స్థానిక భూస్వామ్య రాజకీయాలు చేసే వారితో తమ పార్టీచేయి కలపదని తేల్చి చెప్పారు. పార్టీ ఏడో వార్షికోత్సవం సందర్భంగా చెన్నైలో కమల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తుల గురించి మాట్లాడారు.
ప్రస్తుతం ఏ కూటమిలో చేరలేదనీ, చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. మరో రెండు రోజుల్లో ప్రకటన వెలువడుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా, నటుడు విజయ్ పొలిటిల్ ఎంట్రీని కమల్ స్వాగతించారు.