Sunday 6th July 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నీట మునిగిన చెన్నై.. రజినీకాంత్ కీ తప్పని వరద కష్టాలు!

నీట మునిగిన చెన్నై.. రజినీకాంత్ కీ తప్పని వరద కష్టాలు!

Famous star actor Rajinikanth's house was surrounded by flood water.

-చెన్నైలోని పోయెస్ గార్డెన్ ప్రాంతంలో ఉన్న రజినీ ఇంటి బయట భారీగా వరద నీరు నిలబడ్డాయి.
మిగ్‌జాం తుఫాన్‌ తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. భీకర గాలులు, కుండపోత వానతో చెన్నైలోని అనేక ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి.

నగరంలో కురిసిన భారీ వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలు తగ్గి రెండు రోజులు అయినప్పటికీ నగరం ఇంకా వరద ముంపులోనే ఉంది. చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇంకా తొలగిపోలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నిత్యవసర వస్తువుల కొరత, కరెంటు, ఆహారం, నీరు లేక అల్లాడుతున్నారు. కేవలం సామాన్య ప్రజలే కాదు పలువురు స్టార్‌ సెలబ్రిటీలు కూడా ఈ వరదల్లో చిక్కుకున్నారు.

ప్రముఖ స్టార్‌ నటుడు రజినీకాంత్ ఇంటిని కూడా వరద నీరు చుట్టుముట్టాయి. చెన్నైలోని పోయెస్ గార్డెన్ ప్రాంతంలో ఉన్న రజినీ ఇంటి బయట భారీగా వరద నీరు నిలబడ్డాయి. నీటి ఎద్దడి కారణంగా ఆ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రజినీకాంత్‌ ఇంటి వద్ద వరదనీటికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

మరోవైపు వరద బాధితులకు రజనీకాంత్ రూ.10 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. నటులు సూర్య, ఆయన సోదరుడు కార్తీ కూడా రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. పలువురు సినీ తారలు వరద బాధితులకు ఆహారం, నీరు, నిత్యావసరాలు వంటి సాయం అందజేస్తున్నారు.

You may also like
‘హిందీ రుద్దలేరు..20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ఠాక్రే సోదరులు’
‘ఫిష్ వెంకట్ కు ప్రభాస్ సహాయం..అందులో నిజం లేదు’
ఇద్దరు కుమారులతో పవన్
ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్టార్ హీరో

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions