Friday 2nd May 2025
12:07:03 PM
Home > తాజా > “బిడ్డా ఎన్ని రోజులు ఆపుతారు”: హరీశ్ రావు!

“బిడ్డా ఎన్ని రోజులు ఆపుతారు”: హరీశ్ రావు!

harish rao

Harish Rao Fires On Congress | బీఆరెస్ నేత హరీష్ రావు (Harish Rao) కాంగ్రెస్ పార్టీ (Congress) పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మూలంగానే రైతు బంధు నిలిచిపోయిందని ధ్వజమెత్తారు.

సోమవారం జహీరాబాద్ లో నిర్వహించిన బీఆరెస్ ప్రచార సభలో పాల్గొన్న ఆయన  మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేయడం వల్లనే ఈసీ రైతు బంధును నిలిపివేసిందని ఆరోపించారు.

రైతు బంధు (Rythu Bandhu) ను ఎన్నికల ప్రచారంలో బీఆరెస్ నేతలు, హరీష్ రావు వాడుకుంటున్నారని అందుకోసం ఆ పథకాన్ని నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు ఆయన.

కాంగ్రెస్ పార్టీ రైతుల నోటికాడి ముద్దను లాక్కుంటుందని, వారు ఇవ్వరు ఇచ్చే వారిని అడ్డుకుంటారా అంటూ ప్రశ్నించారు. బిడ్డా ఇంకా ఎన్ని రోజులు ఆపుతారు.. మహా అయితే డిసెంబర్ 3వ తారీఖు వరకు ఆపుతారు ఆ తర్వాత మళ్ళీ వచ్చేది కేసీఆరే.

ఎన్నికల ఫలితాల తర్వాత కచ్చితంగా రైతు బంధు వస్తుందని స్పష్టం చేశారు హరీష్. తమది రైతులతో ఓటు బంధం కాదని పేగు బంధం అని పేర్కొన్నారు.

You may also like
tgsrtc
నిజాయతీ చాటుకున్న కండక్టర్ కు సన్మానం!
cm revanth meets jana reddy
జానా రెడ్డితో సీఎం రేవంత్ భేటి.. కారణం ఏంటంటే!
Metro
మహిళా ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్!
kotha prabhakar reddy
బీఆరెస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions