95-year-old woman walks 20 km to get anti-rabies injection in Odisha | ఒడిశా రాష్ట్రంలో టీకా కోసం ఓ వృద్ధురాలు సుమారు 20 కి.మీ. మేర కాలినడక వెళ్లాల్సి వచ్చింది. ఆమె దయనీయ పరిస్థితి అందర్నీ భావోద్వేగానికి గురిచేసింది.
రాష్ట్రంలోని నువాపడ జిల్లా సీనాపల్లి సమితి శికబాహల్ గ్రామానికి చెందిన 95 ఏళ్ల మంగల్బారి మోహర ఇటీవలే కుక్క కాటుకు గురయ్యారు. కుక్క కరవడంతో సీనాపల్లి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. బుధవారం రేబిస్ టీకా వేయించుకోవాల్సి ఉంది.
ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు రెండు రోజులుగా సమ్మెలో ఉన్నారు. ఇది ఆ వృద్ధురాలికి శాపంగా మారింది. చేసేదేమీ లేక సదరు వృద్ధురాలు గ్రామానికి 10 కి.మీ. దూరంలో ఉన్న సీనాపల్లికి వెళ్లి రేబిస్ టీకా తీసుకున్నారు.
అనంతరం 10 కి.మీ. నడుచుకుంటూ తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇలా వృద్ధురాలు సమ్మె కారణంగా టీకా కోసం 20 కి.మీ. నడవాల్సిన దుస్థితి ఏర్పడింది.