74 Year Old Farmer Save’s Five Peoples Lives By Donating Organs | జాతీయ రైతు దినోత్సవం నాడే ఓ అన్నదాత అవయవదానం చేసి ఐదుగురి ప్రాణాలను కాపాడారు.
ఈ విషయాన్ని తెలంగాణ జీవన్ దాన్ తెలిపింది. మహబూబ్నగర్ జిల్లా అమనగల్ మండలం ముద్విన్ గ్రామానికి చెందిన 74 ఏళ్ల పుట్టి జంగయ్య ఓ రైతు. అయితే డిసెంబర్ 19న అపస్మారక స్థితిలో ఇంట్లో ఒక్కసారిగా పడిపోయారు.
దింతో ఆయన్ను కుటుంబసభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే డిసెంబర్ 23న జంగయ్య బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఇదే సమయంలో జీవన్ దాన్ ప్రతినిధులు జంగయ్య కుటుంబ సభ్యులను కలిసి అవయవదానం విశిష్టతను వివరించారు.
ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. ఈ క్రమంలో జంగయ్య శరీరం నుండి కాలేయం, రెండు మూత్రపిండాలు, రెండు కార్నియాలు సేకరించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఐదుగురికి అమర్చారు.
జంగయ్య అవయవదానం చేసిన సోమవారం నాడే జాతీయ రైతు దినోత్సవం. అవయవదానం చేసి రైతే రాజు అని జంగయ్య నిరూపించారు.