71st National Film Awards 2025 | 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను కేంద్రం ఈ పురస్కారాలను ప్రకటించింది.
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ మరియు యువ నటుడు విక్రాంత్ మస్సే జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారానికి ఎంపికయ్యారు. జవాన్ సినిమాలో నటనకు గాను షారుఖ్, 12త్ ఫెయిల్ సినిమాకు గాను విక్రాంత్ సంయుక్తంగా అవార్డును పంచుకున్నారు.
ఇకపోతే జాతీయ ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ నిలిచారు. ‘మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే’ సినిమాలో నటనకు గాను ఈమె ఉత్తమ నటిగా నిలిచారు. అలాగే ‘ది కేరళ స్టోరీ’ సినిమాను తెరకెక్కించిన సుదీప్తో సేన్ ను ఉత్తమ దర్శకుడి అవార్డు వరించింది.
ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా ’12త్ ఫెయిల్’ అవార్డుకు ఎంపికయ్యింది. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమా అయినా ‘గాంధీతాత చెట్టు’ లో నటించిన సుకృతివేణి అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే బెస్ట్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ మూవీగా ‘హనుమాన్’ నిలిచింది.









