Friday 9th May 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > 1200 కి.మీ.పరుగుతీసి..అయోధ్య రాముడిని దర్శించుకున్న ఆరేళ్ళ బాలుడు

1200 కి.మీ.పరుగుతీసి..అయోధ్య రాముడిని దర్శించుకున్న ఆరేళ్ళ బాలుడు

6 Year Old Boy Runs 1200 Km From Punjab To Ayodhya | అయోధ్య ( Ayodhya ) రామమందిర వార్షికోత్సవాన్ని హిందు క్యాలెండర్ ప్రకారం శనివారం నిర్వహించారు.

ఈ క్రమంలో ఓ ఆరేళ్ళ బాలుడు బాల రాముడిని దర్శించుకునేందుకు పంజాబ్ నుండి ఏకంగా 1200 కి.మీ. పరుగుతీసి అయోధ్యకు చేరుకున్నాడు. శనివారం బాలుడ్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( Cm Yogi Adityanath ) సన్మానించారు.

పంజాబ్ ఫజిల్కా ( Fazilka ) జిల్లా అబోహార్ ( Abohar ) కు చెందిన మోహబ్బత్ ( Mohabbat ) కు ఆరేళ్ళ వయస్సు. అతనికి రామ భగవానుడు అంటే ప్రాణం. ఈ క్రమంలో అయోధ్య రామాలయ వార్షికోత్సవం సందర్భంగా పాకిస్తాన్ బార్డర్ వద్ద ఉండే తన గ్రామం నుండి పరుగు మొదలెట్టాడు.

నవంబర్ 14న తన పరుగును మొదలుపెట్టిన బాలుడు రోజుకు సుమారు 19-20 కి.మీ. ప్రయానించేవాడు. ఇలా సుమారు రెండు నెలలు పరుగుతీసి శుక్రవారం అయోధ్యకు చేరుకున్నాడు.

అనంతరం రాముడిని దర్శించుకుని తన కోరికను నెరవేర్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సీఎం యోగి బాలుడ్ని అభినందించారు.

You may also like
‘BIG BREAKING : ఐపీఎల్ నిరవధిక వాయిదా’
‘జమ్మూలో ఏపీ జవాన్ వీరమరణం’
‘కుటుంబ సభ్యుల మృతి..భారత్ కు వార్నింగ్ ఇచ్చిన ఉగ్రవాది’
‘ఆపరేషన్ సింధూర్..ప్రధాని మోదీ ఫస్ట్ రియాక్షన్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions