Cricket In Olympics | విశ్వ క్రీడల వేదిక ఒలింపిక్స్ గేమ్స్ (Olympic Games)లోకి క్రికెట్ (Cricket in Olympics)కు మళ్లీ చోటు దక్కిన విషయం తెలిసిందే. దాదాపు 128 ఏళ్ల తర్వాత 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ లో క్రికెట్ రీఎంట్రీ ఇవ్వనుంది.
టీ20 ఫార్మాట్ క్రికెట్ తో పాటు స్క్వాష్, బేస్బాల్, లాక్రోస్, ఫ్లాగ్ ఫుట్ బాల్ గేమ్స్ కి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఆమోదముద్ర వేసింది. అయితే తాజాగా ఒలింపిక్స్ లో ఎన్ని జట్లు ఆడతాయనే విషయంలో క్లారిటీ వచ్చేసింది.
టీ20 ఫార్మాట్ లో జరగనున్న 2028 ఒలింపిక్స్ లో టోర్నమెంట్ లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయని బుధవారం తేలింది. మెన్స్ తో పాటు ఉమెన్స్ లో క్రికెట్ లోనూ ఆరు జట్లే ఈ టోర్నీలో పాల్గొంటాయని స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఐసీసీలో 12 జట్లు పూర్తి స్థాయి సభ్యత్వం కలిగి ఉన్నాయి. వీటిలో క్వాలిఫై సాధించే ఆరు జట్ల విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే 2028లో ఒలింపిక్స్ నిర్వహిస్తున్న అమెరికా క్రికెట్ జట్టు నేరుగా ఎంట్రీ అయ్యే అవకాశలు ఉన్నట్లు తెలుస్తోంది.