PM Modi Visits Maha KumbhMela 2025 | ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా వెలుగొందుతున్న ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం మహా కుంభమేళా (Maha Kumbhmela) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
బుధవారం ఉదయం ప్రయాగ్ రాజ్ చేరుకున్న ఆయన రుద్రాక్షలు పట్టుకొని త్రివేణి సంగమం వద్ద కుంభమేళా పుణ్యస్నానం ఆచరించారు. తర్వాత గంగానదికి హారతి ఇచ్చి, పూజలు నిర్వహించారు. ప్రయాగ్ రాజ్ విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడి నుంచి అరైల్ ఘాట్ కు వెళ్లారు.
అక్కిడి నుంచి బోటులో మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. అనంతరం త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం ఆచరించారు. స్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులకు బోటు నుంచే అభివాదం చేశారు.
మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adithyanath) కూడా ఉన్నారు. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. మన దేశంతోపాటు విదేశాల నుంచి భారీసంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఇప్పటివరకు 38 కోట్లమంది పుణ్యస్నానాలు ఆచరించారు.









