Row Over Incorrect India Map On Congress Posters | కర్ణాటక ( Karnataka ) లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ( Flex ) పై వివాదం చెలరేగింది.
1924లో కర్ణాటక లోని బెళగావి ( Belagavi ) లో మహాత్మాగాంధీ అధ్యక్షతన 39వ కాంగ్రెస్ సమావేశం జరిగింది. 2024 నాటికి సరిగ్గా శతాబ్దం పూర్తి అయిన క్రమంలో డిసెంబరు 26న కాంగ్రెస్ పార్టీ అదే బెళగావిలో సీడబ్ల్యూసీ ( CWC ) సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్ర నాయకులు, పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు హాజరవనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. అయితే ఫ్లెక్సీల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ ( Kashmir ), అక్సాయ్ చిన్ ( Aksai Chin ) మిస్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీరుపై బీజేపీ ( BJP ), జేడీయూ ( JDU ) దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ భారతదేశ సార్వభౌమత్వాన్ని పూర్తిగా అగౌరవపరిచిందని, ఇదంతా తమ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకేనని బీజేపీ ఫైర్ అయ్యింది.
వస్తున్న విమర్శలపై కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ స్పందించారు. కొందరు లీడర్ల తప్పిదాల మూలంగా ఇలా జరిగి ఉండవచ్చని, తప్పుగా ముద్రించిన ఫ్లెక్సీలను తొలగిస్తామన్నారు.