Friday 18th October 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఇది దురాక్రమణ.. ఏపీ సర్కార్ పై గుత్తా విమర్శలు! 

ఇది దురాక్రమణ.. ఏపీ సర్కార్ పై గుత్తా విమర్శలు! 

gutha sukhendar reddy

Gutha Sukhender Reddy | శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శనివారం నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఏపీ సర్కార్ దుస్సహాసం చేసిందన్నారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై దండయాత్ర చేసి 13 గేట్లను ఆక్రమించడం దుర్మార్గపు చర్య అని అభివర్ణించారు. ఇది చాలా తీవ్రమైన అంశం అని పేర్కొన్నారు.

“రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం శ్రీశైలం ఆంద్రప్రదేశ్ పర్యవేక్షణలో, నాగార్జున సాగర్ తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షణలో ఉండాలి.

కానీ దురాక్రమణ చేస్తూ ఆంధ్ర ప్రభుత్వం ఇలా చేయడం సరికాదు. ఏపీ ప్రభుత్వ విధానం ప్రజాస్వామ్యనికి  విరుద్ధం. రెండు రాష్ట్రాల ప్రజలు సామరస్య వాతావరణానికి విఘాతం కలిగేలా ఉంది.

ఇప్పటికే కృష్ణా రివర్ బోర్డ్ ఆదేశించింది. అయినా ఆంధ్ర పోలీసులు వెనక్కి పోవడం లేదు. ఆంధ్రకు నీటి విడుదల కూడా కొనసాగుతోంది. రాష్ట్రాల పరిధిలో ఉండే హక్కులను కేంద్రం చేతుల్లోకి పోయే విధంగా ఆంధ్ర ప్రభుత్వం కుట్ర చేసింది” అని గుతా ఆరోపించారు.

 అనంతరం రాష్ట్రంలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ని కొట్టిపారేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి. మళ్ళీ రాష్ట్రంలో బి ఆర్ఎస్  ప్రభుత్వం వస్తుందనే విశ్వాసం ఉందన్నారు.

ఎగ్జిట్ పోల్స్ అన్ని ఫాల్స్ అనీ, ఆదివారం ఎన్నికల కౌంటింగ్ లో బి ఆర్ ఎస్  ప్రభంజనం కనబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేసీఆర్ గారి నాయకత్వంమే తెలంగాణ శ్రీరామరక్ష. రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

You may also like
lulu group
గొప్ప మనసు చాటుకున్న లులూ గ్రూప్ చైర్మన్!
నేటి నుంచి ‘పల్లె పండుగ’..సంక్రాంతి వరకు పనులు పూర్తి!
తెలంగాణ ఊర్లల్ల అసలైన దసరా సంబురం ఇదే.. ఓ ఎన్నారై యాది!
తెలంగాణలో దంగల్ సినిమా రిపీట్..తండ్రి కలను నిజం చేసిన కుమార్తెలు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions