Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > “ముమ్మాటికి వారు తెలంగాణ ద్రోహులే: వైఎస్ షర్మిల!

“ముమ్మాటికి వారు తెలంగాణ ద్రోహులే: వైఎస్ షర్మిల!

sharmila kcr

YS Sharmila Slams KCR | వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ షర్మిల (YS Sharmila) మంత్రి కేటీఆర్ (Minister KTR) ను ఉద్దేశించి మరోసారి విమర్శలు చేశారు.

సీఎంను ప్రజలు కలవాల్సిన అవసరం ఏముందంటున్న కేటీఆర్ కు జనం ఓటు వేయాల్సిన అవసరం ఏముందని విమర్శించారు.

ఓట్లేసి గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికా లేక గడీల్లో భోగాలు అనుభవించడానికా? నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లోనే ప్రజా దర్బార్ పెట్టి ప్రతి సమస్యను వింటే, నేడు కేసీఆర్ చేస్తున్నది నియంత పాలన.

ఓట్లేసిన పాపానికి జనాలకు కష్టాలు.. దొరకు ఫామ్ హౌజ్ వైభోగాలు అని మండిపడ్డారు.  అధికార మత్తులో బీఆరెస్ నాయకులకు ప్రజా సమస్యలు కనిపిస్తలేవన్నారు.

రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని సమస్యల సుడిగుండంలో ముంచారని, మీ పాలనలో ప్రజలకు మిగిలింది కష్టాలు, కన్నీళ్లేనని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ అంతటి అహంకార ముఖ్యమంత్రి చరిత్రలో ఎవ్వరూ లేరనీ, ముమ్మాటికి వారు తెలంగాణ ద్రోహులేనన్నారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions