Monday 26th May 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వైసీపీ ఎమ్మెల్సీ మూడో వివాహం..సాక్షి సంతకం పెట్టిన రెండో భార్య!

వైసీపీ ఎమ్మెల్సీ మూడో వివాహం..సాక్షి సంతకం పెట్టిన రెండో భార్య!

jayamangala venkata ramana third marriage

YCP MLC Third Marriage | వైసీపీ నేత, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ (Jayamangala Venkataramana) మూడవ వివాహం చేసుకున్నారు.

అటవీ శాఖలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న సుజాత (Sujatha) అనే మహిళను సోమవారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఎమ్మెల్సీ మూడవ వివాహానికి రెండవ భార్య సాక్షి సంతకం చేయడం గమనార్హం.

వెంకటరమణ మొదటి భార్య అనారోగ్యం తో మరణించారు. వారికి ఒక కుమార్తె ఉంది. ఆ తర్వాత సునీత అనే మహిళను రెండవ వివాహం చేసుకున్నారు. ఆమెకు ఒక కుమార్తె, కుమారుడు.

అయితే కుటుంబ విభేదాల కారణంతో రెండవ భార్యతో విడాకులు తీసుకున్నారు వైసీపీ ఎమ్మెల్సీ.

తాజాగా కైకలూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో సుజాత ను మూడవ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లిని రెండవ భార్య సునీత, ఆమె కుమారుడు దగ్గరుండి జరిపించారు.

కాగా ఎమ్మెల్సీని వివాహం చేసుకున్న సుజాతకు ఇది రెండవ పెళ్లి.

You may also like
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions