Monday 17th November 2025
12:07:03 PM
Home > తాజా > ఈటలను బీఆరెస్ నుండి బయటకి పంపడానికి ప్రధాన కారణమదే: అమిత్ షా!

ఈటలను బీఆరెస్ నుండి బయటకి పంపడానికి ప్రధాన కారణమదే: అమిత్ షా!

Amit shah

Amit Shah Speech | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections) ప్రచారంలో భాగంగా సోమవారం హుజురాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన బీజేపీ సభలో పాల్గొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆరెస్ ఒక్కటేనని విమర్శించారు. వాళ్ల ఒప్పందంలో భాగంగానే తెలంగాణ లో కేసీఆర్ సీఎం చేయడానికి, దేశంలో రాహుల్ గాంధీని పీఎం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ (Congress)కు ఓటేసినా, బీఆరెస్(BRS)కు ఓటేసినా వాళ్ల కుటుంబ సభ్యులు సీఎం అవుతారని, అదే బీజేపీకి ఓటు వేస్తే బీసీ వ్యక్తి సీఎం అవుతారని తెలిపారు అమిత్ షా (Amit Shah).

కాంగ్రెస్, బీఆరెస్, ఎంఐఎం ఈ మూడు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. పేదల పక్షాన మాట్లాడినందుకే ఈటల రాజేందర్ (Eatala Rajender) ను బీఆరెస్ పార్టీ నుండి బయటకు పంపించారని సంచలన ఆరోపణలు చేశారు.

బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజెర్వేషన్స్ తీసివేస్తామని మరోమారు స్పష్టం చేశారు అమిత్ షా.

You may also like
bjp mp praveen
రాజధాని దిల్లీకి ఆ పేరు పెట్టండి: బీజేపీ ఎంపీ లేఖ!
amit shah
ఇది నరేంద్ర మోదీ భారత్.. వేటాడి అంతం చేస్తాం: అమిత్ షా
amith shah
రాష్ట్రాల సీఎంలకు హోం మంత్రి అమిత్ షా కీలక ఆదేశాలు!
eatala rajendar
లగచర్ల ఘటన స్కెచ్ కాంగ్రెస్ నాయకులదే: ఈటల రాజేందర్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions