YS Jagan Walkout From Assembly | ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం అయ్యాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ( Abdul Nazeer ) ప్రసంగించారు.
కాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ys Jagan ) పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మరింత గట్టిగా పోరాడేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని జగన్ పార్టీ కోరింది.
కానీ.. అడుగడుగునా ఆంక్షలతో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకి దిగిందని ఆరోపిస్తూ ప్రధాన ప్రతిపక్ష హోదాని డిమాండ్ చేస్తూ గవర్నర్ ప్రసంగాన్ని కూడా బాయ్ కాట్ ( Boycott ) చేసి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వైఎస్ జగన్ బయటికి వచ్చారు.
విపక్షంలో ఉన్నది ఒక్కటే పార్టీ కనుక ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, లేని పక్షంలో మీడియా ద్వారా ప్రజా విన్నపాలను వినిపిస్తామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని అలాగే మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.