Tuesday 13th May 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఇది ఏ తరహా పరిపాలనకు నిదర్శనం బాబుగారూ?

ఇది ఏ తరహా పరిపాలనకు నిదర్శనం బాబుగారూ?

Ys Jagan News | రాష్ట్రానికి ఎంబీబీఎస్‌ సీట్లు ( MBBS Seats ) వస్తుంటే సంతోషించాల్సింది పోయి, అవసరం లేదంటూ చంద్రబాబు ( Cm Chandrababu ) ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణమని దుయ్యబట్టారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ( Ys Jagan ).

ఈ మేరకు 8 కీలక పాయింట్లను లేవనెత్తారు. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గమని మండిపడ్డారు.

పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్‌ కాలేజీలు, ఎంబీబీఎస్‌ సీట్లకోసం ప్రదక్షిణాలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పిపంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం చంద్రబాబుగారూ? అని నిలదీశారు.

నాణ్యమైన విద్య, వైద్యాన్ని ప్రజలకు ఒక హక్కుగా అదించడం అన్నది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి, మంచి వైద్యం అందుకోవడానికి ఏ కుటుంబం కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదని తెలిపారు.

ఈ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తప్పించుకుంటుంది చంద్రబాబు గారూ? అలా తప్పించుకుంటే, దాన్ని ప్రభుత్వం అని అంటారా? అని జగన్ ప్రశ్నించారు.

You may also like
మృణాల్ ఠాకూర్ తో పెళ్లి..స్పందించిన నటుడు
‘ఆడవారి సింధూరాన్ని తుడిచారు..అందుకే’
‘మురళీనాయక్ లాంటి వీరులను కన్న తల్లులకు మదర్స్ డే అంకితం’
‘ఆపరేషన్ సింధూర్’ కొనసాగుతుంది..IAF కీలక ప్రకటన

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions