Ys Jagan News Today | గుంటూరు ( Guntur ) జిల్లా జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ( Nandigam Suresh ) ను బుధవారం ములాకత్ లో కలిశారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ( Ys Jagan ). ఈ సందర్భంగా సురేష్ కు ధైర్యం చెప్పిన జగన్, అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం జగన్ మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భంగా, ఇంత దుర్మార్గ పాలన ఆంధ్రాలో ఎప్పూడూ చూడలేదని చెప్పారు. అక్రమ కేసులో ఒక దళిత నేతను అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu ) నిర్లక్ష్యంతో విజయవాడ ( Vijayawada )అతలాకుతలం అయ్యిందని, ఆ తప్పుల నుండి ప్రజలను డైవర్ట్ చేయడానికే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు.
గతంలో సిట్టింగ్ సీఎంగా ఉన్న తనను ఓ టీడీపీ నేత దారుణంగా దూషించినా బాబులగా కక్ష సాధింపుకు దిగలేదన్నారు.
టీడీపీ ఆఫీస్ పై దాడి జరిపాడని సురేష్ ను అరెస్ట్ చేశారని, కానీ ఆ ఘటనలో సురేష్ ఉన్నాడా ? అని జగన్ ప్రశ్నించారు. సీసీ టీవీ ఫుటేజ్ లో సురేష్ ఎక్కడైనా కనిపించాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారని హెచ్చరించారు.