గడిచిన 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ ప్రధానిని 3 సార్లు కలిశారు.
ఇప్పుడు జరుగుతున్న భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ నెల ఆకరిలో ప్రారంభం కానున్న పార్లిమెంట్ సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుంది.లోకసభ లో బీజేపీకి మెజారిటీ ఉన్నా , రాజ్యసభలో మెజారిటీకి కొన్ని సీట్లు తక్కువగా ఉన్నాయి. ఉమ్మడి పౌరస్మృతికి మద్దతు కోసం మోడీ జగన్ భేటీ జరిగిందని, అలాగే జగన్ ఆంధ్రాలో ముందస్తుకు సిద్ధం అవుతున్నట్లు ఆ విషయమే బీజేపీ అధినాయకత్వం తో చర్చించడానికి ఢిల్లీ వెళ్లినట్లు జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి.
అలాగే చంద్రబాబు మరియు అమిత్ షా భేటీ తర్వాత మొదటి సారి జగన్ బీజేపీ అధినాయకత్వంతో భేటీ అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం రోజున ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో మధ్యాహ్నం అమిత్ షాతో సుమారు 45 నిమిషాలు చర్చలు జరిపారు.తర్వాత సాయంత్రం ప్రధాని మోడీతో గంటసేపు సమావేశం జరిగింది.మోడీతో సమావేశం తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మక సీతారామన్ తో భేటీ అయ్యారు వైఏస్ జగన్.
మోడీ, అమిత్ షాలతో జరిగిన భేటీలో ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు, పోలవరం ప్రాజెక్ట్ ల గురుంచి చర్చించినట్టు సమాచారం.
పోలవరం ప్రాజెక్టుకు తక్షణమే రూ.12వేల 911 కోట్లను విడుదల చేయాలని కోరినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుండి బకాయిల రూపంలో సుమారు రూ.30వేల కోట్లు రావాలని వాటిని కూడా విడుదల చేయాలని కోరినట్లు సమాచారం.
భేటీలో ఏం చర్చించారు..?
వైఎస్ జగన్ మోడీ, అమిత్ షాలతో భేటీలో ముఖ్యంగా ముందస్తు ఎన్నికల గురుంచి చర్చించినట్టు ఢిల్లీ జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి.
ఈ సంవత్సరం చివరిలో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, తెలంగాణ, మిజోరాం ఇలా ఐదు రాష్ట్రాలతో పాటు జగన్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాలని ఆ విషయమే బీజేపీ నాయకులతో చర్చించినట్టు కథనాలు వస్తున్నాయి.
ఒకవేళ వైఎస్ జగన్ తను ముందస్తుకు వెళితే కేంద్ర సహకారం కావాలని కోరినట్లు సమాచారం.మరో వైపు ఆంధ్రాలో పొత్తుల గురుంచి కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
మరోవైపు బీజేపీ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని మమత బెనర్జీ, నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు.
మరి జగన్ మోడీ, అమిత్ షాలతో చర్చించి వారి సహకారంతో ముందస్తు ఎన్నికల వెళ్తారా అనేది మరి కొన్ని రోజుల్లో తెలుస్తుంది.
కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, రావాల్సిన బకాయిల గురుంచి మాత్రమే మోడీ,అమిత్ షాలను కలిసినట్లు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు.









