- టీబీ రోగులను దత్తత తీసుకున్న మిమీ చక్రవర్తి!
Mimi Chakraborty | బెంగాల్ కు చెందిన తృణముల్ కాంగ్రెస్ యువ (TMC) ఎంపీ, నటి మిమి చక్రవర్తి (Mimi Chakraborty) తన గొప్పమనసు చాటుకున్నారు. దేశంలో క్షయను (Tuberculosis) సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఆమె గతేడాది నవంబర్ లో ఐదుగురు టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకున్నారు.
తాజాగా ఈ ఏడాది ఆ సంఖ్య 25కి పెరిగింది. క్షయ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకుని స్వయంగా తన సొంత ఖర్చులతో వైద్యం చేయించి, నయం చేయించారు.
మిమీ చక్రవర్తి అక్కడితో ఆగలేదు. వచ్చే ఏడాది కూడా కొంతమంది టీబీ రోగులను దత్తత తీసుకున్నట్లు తృణమూల్ ఎంపీ స్వయంగా ప్రకటించారు. దీంతో ఈ నటి, ఎంపీ గొప్ప చొరవను భారత ప్రభుత్వం, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గౌరవించింది.
మిమి చక్రవర్తి మొదట మోడల్ గా తన కెరీర్ ప్రారంభించారు. ఆమె ఫెమినా మిస్ ఇండియాలో పాల్గొని 2011లో బెంగాల్ సినీ, టెలివిజన్ పరిశ్రమలోకి ప్రవేశించారు. బెంగాలీ సినిమాల్లో నటిగా, గాయనిగా తన ప్రతిభ చాటుకున్నారు. 2019లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మిమి చక్రవర్తి జాదవ్‌పూర్ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు.