YCP Fires On Nara Lokesh | దుబాయ్ వేదికగా టీం ఇండియా పాకిస్తాన్ తో తలపడిన విషయం తెల్సిందే. ఈ మ్యాచును వీక్షించేందుకు మంత్రి లోకేశ్ దుబాయ్ వెళ్లారు.
మంత్రి నారా లోకేష్ మరియు ఎంపీ కేశినేని చిన్ని స్టేడియంలో కూర్చుని మ్యాచుని వీక్షించారు. ఈ నేపథ్యంలో వైసీపీ హాట్ కామెంట్స్ చేసింది.
‘ ఇటు రాష్ట్రంలో గ్రూప్ 2 అభ్యర్థులు అల్లాడుతుంటే అటు పప్పు నాయుడు మాత్రం దుబాయ్ లో ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. అధికారం అంటే మీకు విలాసం.. ప్రజల బాధలు అంటే మీకు సంబరం.. జనం కష్టాలు మీకు సంతోషం.. బాధ్యతలేని బర్రెగొడ్లకు అధికారం ఇస్తే పాలన ఇలాగే తగలడుతుంది.’ అంటూ జగన్ పార్టీ విరుచుకుపడింది.