Thursday 21st November 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మస్క్ ‘X’ ని వణికిస్తున్న ‘Bluesky’

మస్క్ ‘X’ ని వణికిస్తున్న ‘Bluesky’

X Users Jump To Bluesky | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) ఘన విజయం సాధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ( Elon Musk ) పేరు మారుమోగుతోంది.

దీనికి కారణం ట్రంప్ ప్రచారం కోసం మస్క్ రూ. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసాడు, అంతేకాకుండా ట్రంప్ కు మద్దతుగా ప్రచారం సైతం నిర్వహించాడు. కానీ ఇది కొంతమంది అమెరికన్లకు నచ్చలేదు.

అందుకోసమే వారు మస్క్ ‘ X ‘ ని వీడుతున్నారు. ఎక్స్ ని వీడిన యూజర్లు బ్లూస్కై ( Bluesky ) అనే యాప్ లో తమ అకౌంట్ ( Account ) ను క్రియేట్ ( Creat ) చేసుకుంటున్నారు. బ్లూ స్కై వ్యవస్థాపకులు మరోవరో కాదు. ట్విట్టర్ ( Twitter ) మాజీ సీఈఓ జాక్ డోర్సె ( Jack Dorsey ).

2019లో ఇంటర్నల్ ప్రాజెక్టుగా బ్లూస్కై మొదలయినా ఈ ఏడాది పూర్తిస్థాయిలో యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. మొన్నటివరకు 10 మిలియన్ యూజర్లు కలిగిన ఈ యాప్, ట్రంప్ గెలిచిన తర్వాత ఏకంగా 90 లక్షల కొత్త యూజర్లను పొందింది.

అయితే ఎన్నికల్లో మస్క్ ట్రంప్ కు సపోర్ట్ ( Support )చేయడం, భారీ మొత్తంలో నిధులు అందించడం, అంతేకాకుండా ఎక్స్ యాప్ లో రైట్ వింగ్ ( Right Wing ) ఆలోచనా విధానాలు పెరిగిపోతుండడం వంటి అంశాలు కొద్దిమంది అమెరికన్లకు నచ్చడం లేదని తెలుస్తోంది.

You may also like
అమెరికాలో అదానిపై కేసు..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం పవన్ సార్
అదానీపై అమెరికాలో కేసు..షేర్లు డమాల్ !
ఝార్ఖండ్ ఎవరి సొంతం !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions