Warning Posters In Khammam | ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూలై 2న భారీ బహిరంగ సభ వేదికగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఖమ్మంలో శనివారం పోస్టర్లు కలకలం రేపాయి. ఖమ్మం పట్టణంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు ఆయన అనుచరులకు వ్యతిరేకంగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు.
డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వ విజయ్ కుమార్ ను హెచ్చరిస్తూ ”చీకటి కార్తీక్ కు పట్టిన గతే నీకూ పడుతుంది. మంత్రి అజయ్ కుమార్ కాళ్లు పట్టుకొని మీరు క్షమాపణ అడగకపోతే శవాలు కూడా మిగలవు” అని హెచ్చరిస్తూ పోస్టర్లు వెలిశాయి.
కన్నీరు పెట్టుకున్న పొంగులేటి..
ఖమ్మంలో తన అనుచరులని చంపేస్తాం అని పోస్టర్లు వెలిసిన నేపథ్యంలో శనివారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తన అనుచరులను బెదిరించడం అన్యాయం అని ఆవేదన వ్యక్తంచేస్తూ కన్నీరు పెట్టుకున్నారు.
బీఆరెస్ వాళ్లు కాంగ్రెస్ జన గర్జన సభను అడ్డుకోవడాని చాలా ప్రయత్నాలు చేస్తున్నారని పొగులేటి ఆరోపించారు.
అందులో భాగంగానే ప్రజలని తరలించడానికి బస్సులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని తన అనుచరులని చంపి శవాలు లేకుండా చేస్తాం అని బీఆరెస్ వాళ్ళు పోస్టర్లు వేయడం దుర్మార్గం అని ఆయన పేర్కొన్నారు.
తను చెల్లని రూపాయినా లేదా బంగారు నాణాన్న అనేది ప్రజలే నిర్ణయిస్తారని పొంగులేటి మీడియా తో అన్నారు.
బీఆరెస్ పార్టీ ఎన్ని ఆటంకాలు సృష్టించినా జన గర్జన సభను విజయవంతం చేస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.