Waqf Amendment Bill News Telugu | వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రమంత్రి కిరణ్ రిజిజు లోకసభలో బుధవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుతం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు లేకపోతే పార్లమెంటు భవనం ఉన్న స్థలాన్ని కూడా వక్ఫ్ ఆస్తే అంటరాని చెప్పారు. అయితే కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడానికి ఒక కారణం ఉంది.
గతంలో ఏఐయూడిఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో ఉన్న పార్లమెంటు భవనమే కాకుండా పరిసర ప్రాంతాలు కుడా వక్ఫ్ బోర్డు పరిధిలోకే వస్తాయన్నారు. అప్పట్లో బద్రుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు తాజగా కేంద్రమంత్రి ఇలా స్పందించారు.
ఇకపోతే ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లుతో ముస్లిం మత విశ్వాసాలకు ఎలాంటి ఆటంకం కలిగించిందని కిరణ్ రిజాజ్ పేర్కొన్నారు. ఈ బిల్లు కేవలం ఆస్తుల నిర్వహణకు సంబంధించినదని చెప్పారు. మరోవైపు వక్ఫ్ బిల్లు నేపథ్యంలో ఎన్డీయే, ఇండియా కూటమి ఎంపీల మధ్య లోకసభలో మాటల యుద్ధం కొనసాగుతుంది.