Virender Sehwag slams CSK’s chase strategy in IPL 2025 | గత ఐదు ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ 180+ టార్గెట్ ను ఒక్కసారి కూడా ఛేదించలేకపోయిందని పేర్కొన్నారు టీం ఇండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్.
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదు టైటిళ్లు గెలిచి టాప్ టీం గా కొనసాగుతుంది. అయితే ఈ సీజన్ లో మాత్రం పేలవ ప్రదర్శన చేస్తూ అభిమానుల్ని ఆకట్టుకోలేకపోతుంది. తొలి మ్యాచులో విజయం సాధించినా ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచుల్లో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేక పోయింది.
ఆర్సీబీతో జరిగిన మ్యాచులో 197 లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆదివారం రాజస్థాన్ తో జరిగిన పోరులో 183 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోయింది. టీం నిండా అనుభవమున్న బ్యాటర్లు ఉన్నా దూకుడుగా ఆడేవారు లేరని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు ఓవర్లలో 40 పరుగులు చేయడం చాలా కష్టమన్నారు. ధోని లాంటి స్టార్ ఆటగాడు ఉన్నా ఏదొక సందర్భం మినహాయిస్తే రెండు ఓవర్లలో 40కంటే ఎక్కువ రన్స్ చేయడం కష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు.