Vinesh Phogat Returns To India | పారిస్ ఒలింపిక్స్ ( Paris Olympics ) లో అద్భుత ప్రదర్శన కనబరిచి దురదృష్టవశాత్తు అనర్హత వేటు పడడంతో, ఫైనల్స్ ఆడలేకపోయిన రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ( Vinesh Phogat ) స్వదేశానికి చేరుకున్నారు.
శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న వినేశ్ ఫోగాట్ కు భారీగా తరలివచ్చిన అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా అభిమానులను చూసిన వినేశ్ ఫోగాట్ భావోద్వేగానికి గురయ్యారు. అభిమానుల చూసిన వినేశ్ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు.
దింతో కాంగ్రెస్ ఎంపీ దీపందర్ హుడా ( Deepender Singh Hooda )
, రెజ్లర్లు సాక్షి మాలిక్ ( Sakshi Malik ), భజరంగ్ పునియా ( Bajarang Punia ) ఓదార్చారు.
కాగా పారిస్ ఒలింపిక్స్ ఫైనల్స్ ముందు 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంతో ఆమెపై ఒలింపిక్స్ కమిటీ అనర్హత వేటు వేసిన విషయం తెల్సిందే.