Vijayashanthi News| అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ ( BJP ) కి మరో బిగ్ షాక్ ( Big Shock ) తగిలింది. ఇప్పటికే కీలక నేతలు పార్టీని వీడగా మరో కీలక నేత, మాజీ ఎంపీ విజయశాంతి ( Vijayashanthi ) ఆ పార్టీకి రాజీనామా చేశారు.
ఈ మేరకు బుధవారం రాజీనామా లేఖను బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి ( Kishan Reddy ) కి పంపించారు. అనంతరం ఎక్స్ ( Twitter ) వేదికగా విజయశాంతి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ ( Telangana ) లో సెటిలర్లు అనే పదం లేదనీ, ఇక్కడున్న వారంతా తెలంగాణ ప్రజలేనన్నారు. అయితే ప్రాంతేతర పార్టీలను తెలంగాణ సమాజం ఎప్పటికి ఆమోదించారని తెలిపారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పార్టీలకు అధికారాన్ని అప్పగించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.
అయితే ఆంధ్రా ( Andhra ) నుండి వచ్చి ఇక్కడ ఉంటున్నవారిని ఆ పార్టీలకు అంటగట్టడం సరికాదని హితవుపలికారు. ఇక్కడ సెటిల్ ( Settle ) అయిన వారు కూడా తెలంగాణ బిడ్డలే అని తేల్చిచెప్పారు విజయశాంతి.
కాగా తెలంగాణ లో బీజేపీ-జనసేన ( Janasena ) పొత్తు వేళా విజయశాంతి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఇదిలా ఉండగా విజయశాంతి త్వరలోనే కాంగ్రెస్ ( Congress ) పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.