Wednesday 11th February 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వైసీపీకి రాజీనామా..షర్మిలతో విజయసాయి రెడ్డి భేటీ

వైసీపీకి రాజీనామా..షర్మిలతో విజయసాయి రెడ్డి భేటీ

Vijayasai Reddy Meets Sharmila | ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ ( Big Twist ) చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీ పార్టీకి మరియు పదవులకు మాజీ ఎంపీ, వైఎస్ జగన్ ( Ys Jagan )అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఆయన రాజీనామా వెనుక అసలు కారణాలు ఎంటో అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇదే సమయంలో వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ( Ys Sharmila )తో భేటీ అయినట్లు కథనాలు వస్తున్నాయి.

ఈ క్రమంలో షర్మిల విజయసాయి రెడ్డి భేటీకి గల కారణాలపై కాంగ్రెస్, వైసీపీ లో తీవ్ర స్థాయిలో చర్చలు నడుస్తున్నాయి. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో షర్మిల నివాసంలో ఈ భేటీ జరిగినట్లు సమాచారం.

సుమారు మూడు గంటలకు పైగా షర్మిలతో భేటీ అయిన విజయసాయిరెడ్డి మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే చేసినట్లు ప్రచారం జరుగుతుంది.

వైసీపీ ని స్థాపించిన నాటి నుండి జగన్ కు సన్నిహితుడిగా మెలిగిన విజయసాయిరెడ్డి వైసీపీ కి రాజీనామా చేయడమే హాట్ టాపిక్ గా మారగా, ఇప్పుడు ఆయన షర్మిలతో భేటీ అవ్వడం కలకలం రేపుతోంది.

మరోవైపు జగన్, షర్మిల మధ్య కుటుంబ రాజకీయ విభేదాలు తలెత్తాయి. వైసీపీలో ఉన్న సమయంలో షర్మిల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ విజయసాయి రెడ్డి ఇప్పుడు ఆమెతో భేటీ అవ్వడం ఆసక్తిగా మారింది.

You may also like
sachin family invites pm modi for arjun sania wedding
రాష్ట్రపతి, ప్రధానిని కలిసిన సచిన్ కుంటుంబం.. ఎందుకో తెలుసా!
konda sushmitha book rudra
మంత్రి కుమార్తె రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరంజీవి!
ts govt logo
వాహనదారులకు భారీ ఊరట.. ఆ పన్ను నుంచి మినహాయింపు?
vc sajjanar
మీట్ యువర్ సీపీ.. హైదరాబాద్ కొత్వాల్ సజ్జనర్ సరికొత్త కార్యక్రమం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions