VijaySai Reddy Interesting Comments | రాజ్యసభ మాజీ సభ్యులు విజయ్ సాయి రెడ్డి (Vijay Sai Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వెనిజువెలా (venezuela) అధ్యక్షుడిని అమెరికా పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని ముడిపెడుతూ తెలుగు రాజకీయ నాయకులను ఉద్దేశించి ఓ పోస్ట్ చేశారు.
“అమ్ముడు పోయిన “కోటరీల” మధ్య “బందీలుగా” ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకూ ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి!
వెనిజువెలాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు, ఇంతమంది చుట్టూ ఉన్నా, మిసైళ్ళు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా, ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా ఎత్తుకుపోగలిగిందంటే కారణం ఏమిటి? “వారంతా అమ్ముడు పోవటమే కదా” ! అని రాసుకొచ్చారు. తద్వారా తమ చుట్టూ కోటరీతో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పకనే చెప్పారు విజయ్ సాయి రెడ్డి.









