USA President Donald Trump Asked About Kim Jong Un | నార్త్ కొరియా ( North Korea ) అధినేత కిమ్ జోంగ్ ఉన్ ( Kim Jong Un ) ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటారు.
అమెరికా నార్త్ కొరియా దేశాల మధ్య పచ్చ గడ్డి వేసినా బగ్గుమంటుంది. కానీ డోనాల్డ్ ట్రంప్ మరియు కిమ్ జోంగ్ ఉన్ మధ్య మాత్రం స్నేహబంధం ఉంది. అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి గంటలు కూడా గడవకముందే తన పాత స్నేహితుడు కిమ్ ను ఆయన గుర్తుచేసుకున్నారు.
ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ సైనికుల గౌరవార్థం ‘ది కమాండర్ ఇన్ చీఫ్ ఇనాగ్యూరల్ బాల్’ ( Commander-in-Chief inaugural ball )కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌత్ కొరియా ( South Korea ) లో ఉన్న అమెరికా సైనికులతో శాటిలైట్ కాల్ ద్వారా మాట్లాడారు.
ఈ సమయంలో నార్త్ కొరియా కిమ్ ఎలా ఉన్నాడు? అంటూ సైనికుల్ని ట్రంప్ ప్రశ్నించారు. దింతో అక్కడ నవ్వులు విరబూశాయి. కిమ్ తో మంచి స్నేహ సంబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.
కానీ అతడు మాత్రం ఒక పట్టాన వినే మనిషి కాదని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ గా మారాయి. కాగా 2019లో వియత్నాం వేదికగా ట్రంప్ కిమ్ కలుసుకున్న విషయం తెల్సిందే.