US Elections Polling | అమెరికా అధ్యక్ష ఎన్నికల (US President Elections) సమరం ప్రారంభమైంది. నవంబర్ 5 మంగళవారం పోలింగ్ జరగనుంది. రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హ్యారిస్ ప్రెసిడెంట్ పదవికీ పోటీ పడుతున్నారు.
అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ఓ ఆసక్తికర విషయం ఏంటంటే ప్రతిసారి పోలింగ్ మంగళవారం రోజే జరుగుతుంది. నవంబర్ నెల మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారమే ఈ పోలింగ్ నిర్వహిస్తారు. దీని వెనుక ఆసక్తికరమైన కారణం ఉంది.
అమెరికా ప్రజలు మెజారిటీ క్రిస్టియన్స్. ఈ క్రమంలో ఆదివారం వారు చర్చికి వెళ్తారు. అలాగే బుధవారం రైతులు తమ ఉత్పత్తులను అమ్మేందుకు మార్కెట్ కు వెళ్లేవారు. ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాలకు పోలింగ్ బూతులు దూరంగా ఉండేవి.
ఓట్లు వేయాలంటే ప్రజలు చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. అన్నింటికీ అనుకూలంగా మంగళవారం రోజును ఖరారు చేశారు. ఆదివారం చర్చికి వెళ్లి, సోమవారం ప్రయాణం చేసి, మంగళవారం ఓట్లు వేశారు. అనంతరం అక్కడి నుంచి బుధవారం రైతులు మార్కెట్లకు వెళ్లే విధంగా ఎన్నికల తేదీని ఖరారు చేశారు. అదే సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.










