Uranium Mining In Andhra Pradesh | పచ్చని పల్లెల్లో యురేనియం ( Uranium ) అగ్గి రాజేసింది. యురేనియం తొవ్వకాలు చేపడితే తమ గ్రామాలు ఉనికి లేకుండా పోతాయని ప్రజలు పోరుబాట పట్టారు.
కర్నూల్ ( Kurnool ) జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాల ( Kappatralla ) గ్రామంతో పాటు మరో 12 గ్రామాల్లో యురేనియం తవ్వకాలతో వణుకు పుట్టింది. అణు విద్యుత్ ఉత్పత్తి చేసే దేశాల సరసన నిలవాలని కేంద్రం భావిస్తుంది.
కప్పట్రాల, నల్ల చెలిమిల, గుండ్లకొండ చెల్లెలి చెలిమిల గ్రామాల పరిధిలో 468 హెక్టార్ల అటవీ భూమి ఉంది. ఇక్కడ యురేనియం నిక్షేపాల కోసం తవ్వకాలు జరిపేందుకు కేంద్రం సిద్ధం అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు యురేనియం వద్దే వద్దు అని నినదిస్తున్నారు.
కర్నూల్ బళ్లారి రహదారి ( Highway )పై వేల సంఖ్యలో గ్రామస్థులు బైఠాయించి అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు మహిళలు మందు డబ్బలతో, పెట్రోల్ సీసాలతో నిరసన తెలుపుతున్నారు. తవ్వకాలు జరిపితే తమ ఉనికే ప్రశ్నార్ధకం అవుతుందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.