Saturday 21st March 2026
12:07:03 PM
Home > తాజా > సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపిన ఉపాసన

సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపిన ఉపాసన

Upasana Konidela Thanks Cm Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉపాసన కొణిదెల కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం ‘తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ-2025’ ను ఆవిష్కరించిన విషయం తెల్సిందే.

ఒలింపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు బంగారు పతకాలు సాధించడమే లక్ష్యంగా దీనిని రూపొందించినట్లు సీఎం పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో క్రీడా రంగాన్ని తీర్చిదిద్ది, ప్రపంచ శక్తిగా మార్చలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ‘స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ’ను రూపొందించింది.

ఈ సంస్థకు ఛైర్మన్ గా పారిశ్రామికవేత్త, ఐపీఎల్ జట్టు లక్నో సూపర్ జయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాను నియమించింది. అలాగే ఉపాసనను కో-ఛైర్మన్ గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఉపాసన స్పందించారు.

తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ శక్తిగా రూపొందించడానికి సంజీవ్ గోయెంకాతో కలిసి కో-ఛైర్మన్‌గా ఉండటం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలను (PPP) నిర్మించడానికి మరియు రాష్ట్రంలో భవిష్యత్తు కోసం క్రీడా వాతావరణాన్ని సృష్టించడానికి ఇది ఒక శక్తివంతమైన అడుగు అనే ఉపాసన అభిప్రాయం వ్యక్తం చేశారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions