Bandi Sanjay slams Hydraa | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Union Minister Bandi Sanjay Kumar) హైడ్రా (Hydraa)పై తీవ్ర విమర్శలు చేశారు. సల్కం (Salkam)చెరువులో నిర్మించిన అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) కాలేజీని కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ట్వీట్ చేయడం పై ఆయన మండిపడ్డారు.
మూసీ పరీవాహక ప్రాంతాల్లో బతకాడానికి వేసుకున్న పేదల ఇండ్లు, గుడిశెలను నిర్దాక్షిణ్యంగా కూల్చి వేసిన హైడ్రా అక్బరుద్దీన్ కాలేజీ కూల్చడానికి మాత్రం వెనకడుగు వేస్తోందని విమర్శించారు. సల్కం చెరువును కబ్జా చేసి ఆ కాలేజీ నిర్మించారని ప్రస్తుత ప్రభుత్వమే ధ్రువీకరించిందని గుర్తు చేశారు బండి సంజయ్.
మరి అలాంటప్పుడు ఆ కాలేజీని ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. పేదలకు ఒక న్యాయం.. అక్బరుద్దీన్ కు ఒక న్యాయమా అని నిలదీశారు బండి సంజయ్ నిలదీశారు. ఇది హైడ్రా నిర్ణయమా లేక ప్రభుత్వ నిర్ణయమా చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థులను ఇతర కాలేజీలకు షిఫ్ట్ చేసి కూల్చేయాలని సూచించారు.