UK entrepreneur serves Indian masala chai to PM Narendra Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజగా యునైటెడ్ కింగ్డమ్ పర్యటనకు వెళ్లిన విషయం తెల్సిందే.
యూకే పీఎం కీవ్ స్టార్మర్ నివాసం అయిన చెకర్స్ లో ఇరుదేశాల ప్రధానులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా స్వేచ్చా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.
చెకర్స్ లోని యూకే ప్రధాని నివాసంలో భారత మూలాల ఉన్న అఖిల్ పటేల్ అనే యువ వ్యాపారవేత్త ఒక టీ స్టాల్ ను ఏర్పాటు చేశారు. ఇద్దరు ప్రధానులు ఆ టీ స్టాల్ ను సందర్శించారు. ఈ క్రమంలో అఖిల్ పటేల్ మసాలా చాయ్ ని అందించారు.
తొలుత యూకే ప్రధానికి టీని అంధించారు. ఆ తర్వాత ప్రధాని మోదికి టీని అందిస్తూ ‘ఒక చాయ్ వాలా నుంచి మరో చాయ్ వాలాకు’ అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు ప్రధాని చిరునవ్వు చిందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రధాని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘భారత్-యూకే సంబంధాలు బలపడుతున్నాయి. చెకర్స్ లో కీవ్ స్టార్మర్ తో చాయ్ పే చర్చ’ అనే కాప్షన్ ను ప్రధాని మోదీ జతచేశారు.









