-292 పట్టణాల్లో పరీక్షను నిర్వహిస్తారు.
-అడ్మిట్ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పరీక్ష అయిన యూజీసీ నెట్ పరీక్ష బుధవారం ప్రారంభం కానుంది. డిసెంబర్ 6 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా 292 పట్టణాల్లో పరీక్షను నిర్వహిస్తారు.
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పరీక్ష అయిన యూజీసీ నెట్ పరీక్ష బుధవారం ప్రారంభం కానుంది. డిసెంబర్ 6 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా 292 పట్టణాల్లో పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 83 సబ్జెక్టులకు రెండు సెషన్లలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్) ఉంటుంది. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీవిడుదల చేసింది. అభ్యర్థులు పరీక్ష రోజు ఉదయం వరకు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌తోపాటు https://ugcnet.nta.nic.in/ వెబ్‌సైట్ ద్వారా కూడా తమ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
కంప్యూటర్ ఆధారితంగానిర్వహించే పరీక్ష రెండు సెషన్లలో ఉంటుంది. మొదటి పేపర్‌ను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో పేపర్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌లో మొత్తం 150 చొప్పున ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. ఇందులో ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ లేదు. అంటే సమాధానాలు తప్పుగా గుర్తించినప్పటికీ మార్కులు కోతవిధించరు.