Uddhav Thackrey Meets Ajit Pawar
మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన ( Shiv Sena ) (ఉద్ధవ్ వర్గం ) అధ్యక్షులు ఉద్ధవ్ థాక్రే ( Uddhav Thackrey ) , మహారాష్ట్ర డిప్యూటీ ( Deputy ) సీఎం, ఎన్సీపీ చీలిక వర్గ నాయకుడు అజిత్ పవార్ ( Ajit Pawar ) సమావేశం అయ్యారు.
బెంగళూర్ లో నిన్న జరిగిన ప్రతిపక్షాల భేటీలో ఉద్ధవ్ పాల్గొన్నారు. అలాగే ఢిల్లీలో బీజేపీ నేతృత్వంలో జరిగిన ఎన్డీయే ( NDA ) సమావేశానికి అజిత్ పవార్ హాజరయ్యారు.
26 ప్రతిపక్ష పార్టీలతో INDIA కూటమిలో భాగమైన ఉద్ధవ్ , ఎన్సీపీ చీలిక వర్గంతో బీజేపీ మిత్రునిగా మేలుగుతున్న అజిత్ పవార్ లు భేటీ అవ్వడం జాతీయ స్థాయిలో చర్చినియంశంగా మారింది.
భిన్న కుటములలో ఉన్న ఇరువురు నాయకులు భేటీ అవ్వడం కొత్త రాజకీయ చర్చకు దారి తీసింది.
కాగా ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఏకనాథ్ షిండే తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది.
ఇటీవల ఎన్సీపీని రెబెల్ ( Rebel ) నేత మరో ఎనిమిది మంది ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలతో బీజేపీ-శివసేన (ఏకనాథ్ షిండే ) ప్రభుత్వంలో భాగమయ్యారు. షిండే ప్రభుత్వంలో చేరిన తర్వాత మొదటి సారి ఉద్ధవ్ , అజిత్ పవార్ లు కలిశారు.
మహారాష్ట్రలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సంధర్బంగా మర్యాద పూర్వకంగానే ఈ భేటీ జరిగినట్లు వారు చెపుతున్నారు.