TTD News Latest | శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు వివిధ దేశాల్లో శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయాలను నిర్మించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపడుతోంది.
ఈ మేరకు వివిధ దేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నిపుణుల కమిటీ టీటీడీ ధర్మకర్తల సమావేశంలో నివేదిక సమర్పించింది. దీనిపై టీటీడీ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి సదరు కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మించేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయించారు.










